🏠 www.aadhabtoday.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 9:47 pm Posted by : AADHAB TODAY

**అమ్మవార్ల సన్నిధిలో ఎమ్మెల్యే గాంధీ దంపతుల ప్రత్యేక పూజలు**

News Image
**అమ్మవార్ల సన్నిధిలో ఎమ్మెల్యే గాంధీ దంపతుల ప్రత్యేక పూజలు**

ఆదాబ్ టుడే (శేరిలింగంపల్లి ):
వివేకానంద నగర్ డివిజన్ లో విజయదశమి సందర్భంగా చిత్తారమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల్లో పిఏసి చైర్మన్ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవితో కలిసి డివిజన్లోని శ్రీ చిత్తారమ్మ, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాలలో ఈవో సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు పొందారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ మంచినీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, భావితరాల కోసం సహజ వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు నాయినేని చంద్రకాంతరావు, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నరు. .
🏠 Home