తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీ పి గౌతమ్ ను కలిసి వినతి పత్రం ఇస్తున్న : బీఆర్ యస్ ఎమ్మెల్యేలు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అరులైన పేదలకు అన్యాయం : బీఆర్ యస్ ఎమ్మెల్యేలు
_________________________________
అర్హులైన పేదలకే డబుల్ బెడ్ రూమ్ లు కేటాంచాలి. .
ఇష్టరాజ్యానికి ఇందిరమ్మ కమిటీలకు డబుల్ బెడ్ రూమ్ ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వదిలివేయడం,అక్రమార్కులకు వరంగా మారింది. .
అరులైనా పేదలతో సెక్రటరియేట్ ని ముట్టడిస్తాం. .
హైద్రాబాద్ అక్టోబర్ 22(ఆదాబ్ టుడే ): డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలను అరికట్టి పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతూ హైదరాబాద్ మహా నగర పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు గురువారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీ పి గౌతమ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కూకట్పల్లి, కుతుబుల్లాపూర్, మల్కాజ్ గిరి, ఎల్ బి నగర్, ఉప్పల్, మహేశ్వరం, అంబట్ పేట నియోజకవర్గాల శాసన సభ్యులు ఆయా ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను వీపీ గౌతమ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో నిజమైన పేదలకు కాకుండా మంత్రులు, అధికారుల సిఫారసుల ఆధారంగా ఎలాంటి లాటరీ పద్ధతి లేకుండా ఇష్టరాజ్యంగా కేటాయిస్తున్నా విషయం ఆధారాలతో చూపించారు. అదేవిధంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇష్టరాజ్యానికి ఇందిరమ్మ కమిటీలకు డబుల్ బెడ్ రూమ్ ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వదిలివేయడం ద్వారా నిజమైన పేదలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నిజమైన పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అక్రమార్కులకు, అడ్డదారిలో కేటాయింపులు జరిపితే సహించేది లేదని గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సెక్రటేరియట్ ముట్టడిస్తామని కూకట్పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. కార్యక్రమలో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.