ప్రగతి ఎన్‌క్లేవ్‌ కాలనీ అసోషియేషన్ లో ఘనంగా అమ్మవారి నవరాత్రుల మహోత్సవం

ప్రగతి ఎన్‌క్లేవ్‌ కాలనీ అసోషియేషన్ లో ఘనంగా అమ్మవారి నవరాత్రుల మహోత్సవం ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ అట్టేపల్లి రామప్రభు మరియు అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకుని ఘనంగా అన్నవితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, మహిళలు మరియు చుట్టుపక్కల కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులందరూ అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో అమ్మవారి నవరాత్రుల వేడుకలు వైభవంగా జరిగాయి.