*ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు*
*ఎమ్మెల్యే అరేకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు* మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఆదాబ్ టుడే (శేరిలింగంపల్లి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగను పురస్కరించుకుని పరస్పరం శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు